యానాంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొత్త అల్లుడికి 470 రకాల పిండి వంటలతో సోమవారం పసందైన విందు ఏర్పాటు చేశారు. వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు సత్య భాస్కర్ వెంకటేశ్వరి దంపతుల కుమార్తె హరిణ్యకు ఇటీవల వివాహమైంది. ఆమె భర్త విజయవాడకు చెందిన సాకేత్కు మొదటి పండుగ సందర్భంగా పసందైన విందు ఏర్పాటు చేశారు. శాఖాహారంతో ఏర్పాటు చేసిన ఈ విందు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. గోదారోళ్లంటే ఇలా ఉంటుందని నిరూపించారు.