దీపావళి పండుగ నుంచి అర్హత కలిగిన పేదలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందించనుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నిడదవోలు రూరల్ మండలంలోని ముప్పవరం గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.