నిడదవోలు: కోటసత్తెమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి

84చూసినవారు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసిన కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 15 నుంచి 19 వరకు మహోత్సవాలు జరగనున్నట్లు కార్య నిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ శనివారం తెలిపారు. 15న అమ్మవారికి లక్ష కుంకుమార్చన, 16, 17, 18న అమ్మవారికి చీర, సారే సమర్పణ, 19న మహిళా కోలాటాలు, బాణాసంచా, గరగ నృత్యాలతో ప్రదర్శనలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్