మానసిక దివ్యాంగులకు సంప్రదాయాలు తెలియజేసే విధంగా నిడదవోలు మండలం శంకరాపురంలో సోమవారం మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో భోగి సందర్భంగా బోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. దివ్యాంగులకు కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు ఆటపాటలుతో జరిపారు. ప్రాంగణంలో ముగ్గులు వేయించి బోగి మంటలు వేసి సాంప్రదాయికంగా నిర్వహించినట్లు నిర్వాహకులు డి. గణేష్ బాబు, బి. విశాలాక్ష్మి తెలిపారు.