గత వైసీపీ పాలనలో రోడ్లు నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఆదివారం నిడదవోలు మండలంలోని ముక్కామల గ్రామంలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పాత్ హోల్ ఫ్రీ ఏపీ' పేరిట రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేపట్టి గుంతల్లేని రహదారుల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.