సామర్లకోట సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా కృష్ణభగవాన్ ను నియమించారు. సామర్లకోట సీఐగా నియమితులైన కృష్ణ భగవాన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో పెద్దాపురం సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నూతన సీఐగా నియమితులైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.