చెకుముకి పోటీల గోడ పత్రిక ఆవిష్కరణ

75చూసినవారు
చెకుముకి పోటీల గోడ పత్రిక ఆవిష్కరణ
చెకుముకి పోటీలతో విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు వీఎస్ రెడ్డి తెలిపారు. పిఠాపురం చెలికాని భావనరావు సభా సదన్ సోమవారం గోడ పత్రికను ఆవిష్కరించారు. పాఠశాలలో ఈ నెల 25న, మండల స్థాయిలో అక్టోబరు 1న, జిల్లాస్థాయి అక్టోబరు 27న, నవంబరు 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీలపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్