గొల్లప్రోలు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

77చూసినవారు
గొల్లప్రోలు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
గొల్లప్రోలుకు చెందిన షేక్ ఖాదర్వలీ కనిపించడం లేదని అతని భార్య సత్తాబ్బీ ఫిర్యాదు చేయడంతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గతేడాది ఏప్రిల్ 3న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. అతనికి ఫోన్ చేయగా రెండుమూడు రోజుల్లో వస్తానన్నారని, తరువాత ఆచూకీ లేదన్నారు. అత్తమామలను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని బాధితురాలు పేర్కొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్