సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటకు చెందిన సారిపల్లి వెంకటరమణ అలియాస్ శ్రీనుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ గురువారం తెలిపారు. తప్పుడు ప్రచారంపై ఎం. రమేశ్వరరావు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వెంకటరమణను పిఠాపురం కోర్టులో హాజరుపరిచామన్నారు. కేసును సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారన్నారు.