ఢిల్లీలో అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న చేనేత వస్త్ర ప్రదర్శనలో రోడ్డులో ఏర్పాటు చేసిన ఉప్పాడ పట్టుచీరల స్టాల్ ను సినీ నటి కుష్బూ బుధవారం సందర్శించి పట్టు చీరలు కొనుగోలు చేశారు. ఉప్పాడకు చెందిన చేనేత కార్మికుడు కాకి గంగాధర్ పట్టు చీరల తయారీ, విశిష్టతను ఆమెకు వివరించారు. ప్రతి ఒక్కరూ నేత వస్త్రాలను ధరించి రంగాన్ని ప్రోత్సహించాలని కుష్బూ కోరారు.