యు. కొత్తపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు

62చూసినవారు
యు. కొత్తపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఉప్పాడకు చెందిన సాయికుమార్ (26) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం బయటకు రాకుండా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేయగా యు. కొత్తపల్లి పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉప్పాడ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్