పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎం. సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రావణ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని ఆలయంలో అంకురార్పణతో మొదలుపెట్టి, 17న పవిత్ర ప్రతిష్ఠ 18న సమర్పణ, 19న మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.