శంఖవరం మండలం గొంది గ్రామానికి చెందిన గంటిమల్ల సతీశ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. ప్రత్తిపాడు సీఐ బి. సూర్య అప్పారావు గురువారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. 2003లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారన్నారు. తాజాగా కోర్టులో విచారణ అనంతరం జైలు శిక్షతో పాటు రూ. 5, 000 జరిమానా కూడా విధించిందని తెలియజేశారు.