ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిగుసువాడ, గంగవరం, బలరాంపురం గ్రామలలో ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుఫుల సత్య ప్రభ రాజా, జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ ) సిసి రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి అన్నారు. పంచాయతీల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.