రౌతులపూడి: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

53చూసినవారు
రౌతులపూడి: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామ శివారులో అక్రమంగా నాటుసారా కాస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో దాడి చేసారు. సుమారు 150 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కూరాకుల దేవుడు, కొంకిపూడి ఏసుబాబు చెందిన నాటుసారా స్థావరాలపై దాడి చేసి 600 లీటర్ల బెల్లపుటను ధ్వంసం చేసి 150 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని వారి ఇద్దరిపై కేసు నమోదు చేసామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్