తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్ఐలను నియమిస్తూ జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనపర్తి ఎస్ఐగా శ్రీను నాయక్, బిక్కవోలు ఎస్ఐగా రవిచంద్రకుమార్, రాజమండ్రి వన్ టౌన్ ఎస్ఐగా రాంకుమార్, బొమ్మూరు ఎస్సైగా ప్రియ కుమారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.