రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమితులైన వారిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ బుధవారం రాజమండ్రిలో అభినందించారు. ఏపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితులైన మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితులైన మాజీ కార్పొరేటర్ బాబీలకు శుభాకాంక్షలు తెలిపారు.