సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

81చూసినవారు
సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
గోదావరీ నదికి వరదల హెచ్చరికల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం రాత్రి రాజమండ్రిలో ప్రకటించారు. గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎర్ర కాలువ కారణంగా వరద నీరు హెచ్చరికల నేపధ్యంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్