రాజమండ్రిలోని కోటిపల్లి సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద బాలల దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు గురువారం నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదువుకోవాలని సూచించారు.