ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను విద్యా సంస్థలకే నేరుగా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, దశల వారీగా బకాయిలు సైతం విడుదల చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టమైన హామీనిస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.