స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఘన నివాళి అర్పించారు. శుక్రవారం రాజమండ్రిలోని గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా, అటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు.