తూ. గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు స్త్రీ హింసా వ్యతిరేఖ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో సోమవారం సాయంత్రం జిల్లా మహిళా రక్షక్ టీం అవగాహన ర్యాలీ, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన కల్పించారు. ప్రజలు, యువత, విద్యావంతులైన వారు మహిళలకు మద్దతు ఇస్తూ, సమాజంలో మార్పులు తీసుకురావాలన్నారు.