నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాజమండ్రి రూరల్ మండలానికి చెందిన బిజెపి నాయకులు యానాపు యేసు బుధవారం నియమితులయ్యారు. ఆయన 2 సార్లు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, రెండు సార్లు మండల అధ్యక్షులుగా చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి రూరల్ బీజేపీ అసెంబ్లీ కో-కన్వినర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో యానాపు యేసు మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు.