ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

59చూసినవారు
ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే
రాజానగరం నియోజవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. మంగళవారం రాజానగరంలోని తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ శారదాదేవి, డిబిఈఓ సుబ్రహ్మణ్యం ఇతర అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కోరుకొండలో డీగ్రీ కళాశాలకు అలాగే రాజానగరం, దివాన్ చెరువు, గాదరాడ లలో జూనియర్ కళాశాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్