కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలలో ఈ సంవత్సరం మొక్కజొన్న సాగు రైతులు విస్తృతంగా చేపట్టారు. గత సంవత్సరం ఈ మూడు మండలాలలో 25 వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ స్థాయిలో మొక్కజొన్న సాగు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఏ పంట సాగు చేసిన తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నిత్యం పర్యవేక్షిస్తు ఉండాలని నిపుణులు సూచనలు పాటించాలన్నారు.