రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ సుధా సాగర్ పతాక ఆవిష్కరణ చేసి విద్యార్థుల ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవ గొప్పతనం వివరించారు. కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేశ్వరరావు జూనియర్ సివిల్ జడ్జి శారద బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ పలివెల సత్యనారాయణ పతాకావిష్కరణ చేసి వందనం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కడియాల అశోక్ కుమార్ పతాకావిష్కరణ చేశారు.
రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రధమ మహిళ శ్రీదేవి, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి జాతీయ పతాకం ఎగురవేశారు. ఇరిగేషన్ డి ఈ ఆఫీస్ వద్ద పతాక ఆవిష్కరణ చేశారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ అంబటి భవాని ఎంపీడీవోతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. ఏరియా ఆసుపత్రి వద్ద ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎస్ ప్రవీణ్, టిడిపి పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్, గరికిపాటి సూర్యనారాయణ తదితరులు పతాకావిష్కరణ చేశారు. గ్రామాల్లోను ప్రభుత్వ కార్యాలయాలు వద్ద పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.