కే గంగవరం మండలం కోట గ్రామంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని వివి రామరాజు ఆర్డిఒ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ మండలంలో గల పాతకోట, మసకపల్లి, బట్లపాలిక గ్రామాల పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో గోదావరి వరదకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఎటువంటి ఇసుకతవకాలు చేపట్టరాదని నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశించిందన్నారు.