కాజులూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో దాళ్వా సాగుకు రైతాంగం సిద్ధమవుతున్నారు. చాలావరకు రైతులు విత్తనాలు వెదజల్లే విధానం పై ఆసక్తి చూపుతున్నారు. అతి తక్కువ శాతం మాత్రమే సాంప్రదాయ ఊడ్పు విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా రైతాంగానికి దాళ్వా సాగులోనే ఆశాజనకమైన దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆదివారం మండల వ్యాప్తంగా దాళ్వా దమ్ముల ప్రక్రియ ముమ్మరం చేశారు.