ఈ-క్రాప్ ద్వారానే ప్రభుత్వ పథకాల వర్తింపు: ఏవో రాకేష్

61చూసినవారు
ఈ-క్రాప్ ద్వారానే ప్రభుత్వ పథకాల వర్తింపు: ఏవో రాకేష్
పకృతి వైపరీత్యాలు వల్ల కలిగే నష్టాన్ని ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకు చెల్లిస్తామని మండల వ్యవసాయ అధికారి రాకేష్ తెలిపారు. మలికిపురం మండలం రామరాజు లంకలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. తమ సమస్యలు పరిష్కరిస్తేనే పంటలు సాగు చేయగలమని లేని పక్షంలో పంటల సాగుకు స్వస్తి పలుకుతామని రైతులు పేర్కొన్నారు. కాలువలు అభివృద్ధి, మురుగు కాలవల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్