మలికిపురం: ఎమ్మెల్యేను కలిసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే వివరణ

52చూసినవారు
మలికిపురంలోని ఎంవీఎన్ కళాశాల అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకే తాను రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ను కలిశానని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. మలికిపురం మండలం కత్తిమండలో ఆయన కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రముఖులతో తాను సమావేశం నిర్వహించానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్