మామిడికుదురు జాతీయ రహదారి నుంచి కొర్లగుంట వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డు అద్వానంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం క్షణక్షణం భయంగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడి వాహనాలపై వెళ్లేవారు జారి పడిపోతున్నారన్నారు. కిలోమీటరు మేర పొడవున్న ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు ఆధునికీకరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు బుధవారం కోరారు.