రాజోలు మండల కేంద్రం రాజోలులో శనివారం జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సంప్రదాయబద్ధంగా జరుపుకునే చవితి వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.