జనావాసాల నడుమ మద్యం దుకాణం పెట్టవద్దు అంటు బుధవారం రాజోలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద రాజోలు పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలనకు విరుద్ధంగా రాజోలు భారంవారి వీధిలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం తగదని నినాదాలు చేశారు. గుడి, బడి, జనావాసాలకు దూరంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.