తుని పట్టణంలో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రజలంతా నిమజ్జనం చేయాలని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలో ఉన్న గణేష్ మండపాల వద్ద మహిళ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు వివరించారన్నారు. ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే గ్రహించాలన్నారు. గణేష్ నిమజ్జనాలు తుని పట్టణ ధోబీ ఘాట్ వద్ద జరుగుతున్నాయని తెలిపారు.