కోటనందూరు పోలీస్ స్టేషన్ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై రామకృష్ణ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.