కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామం నందు శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొలువైన నాగదేవతలకు నాగుల చవితి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం వేకువ జూము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని నాగుల పుట్టలో నాగదేవతలకు కోడి గుడ్లు, పాలు, నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినారు. తదనంతరం ప్రసాదం స్వీకరించి ఎటువంటి ఆపదలు రాకుండా సుఖంగా ఉండాలని నాగ దేవతలను వేడుకొన్నారు.