తుని: తాండవ శివ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం

61చూసినవారు
తుని: తాండవ శివ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం
తుని పట్టణంలో కొట్రల్ కొండ వద్ద వెలసిన శ్రీఉమామహేశ్వరి సమేత తాండవ శివలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్తిక మాసం నాలుగో సోమవారం కావడంతో ఈ అన్నదాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శివ స్వాములు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్