అధికారుల అనుమతి లేకుండా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టిన, తరలించిన చర్యలు తప్పవని తహసీల్దార్ బి. విజయ ప్రసాద్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో విజయప్రసాద్ మాట్లాడుతూ పాపవినాశనం క్వారీ నుంచి ఎడ్ల బండితో తరలిస్తున్న ఇసుకను తహసీల్దార్ కార్యాలయం వద్ద దింపించి బండి యజమానిని హెచ్చరించినట్లు తెలిపారు.