సంపూర్ణ స్వచ్ఛత ఆదర్శనీయంగా నిలుస్తుందని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ ఆర్ కే ప్రసాద్ అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం 3,322వ రోజుకు చేరుకుంది. శనివారం స్వచ్ఛ కార్యకర్తలు చల్లపల్లిలోని అమరావతి రాజా పాలెస్, ఎస్సీ కాలనీ పరిసరాలను శుభ్రం చేశారు. రహదారి వనంలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు. సుందర చల్లపల్లి కన్వీనర్ పద్మావతి రోడ్డు పక్కన గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు తీర్చిదిద్దారు.