డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి

55చూసినవారు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని సర్పంచ్ బి. వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. సోమవారం ఘంటసాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద డ్రగ్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ పంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విఆర్వో శివ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని తెలిపారు. సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్