ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు 100 తరాల ఎస్సీ, ఎస్టీ ఉప కులాలకు భవిష్యత్తు నిర్దేశించబోతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పోరాటం ఫలితంగానే ఈ విజయం సాధించుకున్నామని హర్షం వ్యక్తంచేశారు. గురువారం నాగాయలంకలోని రాజేశ్వరి కాలనీలో ఎమ్మార్పీఎస్, బిజెపిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.