మోపిదేవి: చినుకు పడితే రహదారి మొత్తం చిత్తడే

69చూసినవారు
మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రధాన సెంటర్ లో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డుపై అనేక గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తారు. ప్రధాన సెంటర్లో నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీ, ఆర్ అండ్ బి శాఖ వారు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్