పంట కాలువల ద్వారా సాగునీటిని సక్రమంగా అందించే క్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చల్లపల్లి మండలం నడకుదురు, పురిటిగడ్డ పంచాయతీల పరిధిలో 7వ నెంబరు పంట కాలువలో పూడిక తీత పనులు చేపట్టారు. ఎంపీటీసీ మేకా బంగారుబాబు, జనసేన నేత వేమూరి గోవర్ధన్, రైతులు పనులను పర్యవేక్షించారు. లస్కర్ మూర్తి పాల్గొన్నారు.