పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన గార్లపాటి రాజ్యలక్ష్మి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో రూ. 45వేలు సీఎంఆర్ఎఫ్ సహాయం మంజూరు కాగా, ఎమ్మెల్యే వారి కుటుంబానికి చెక్క అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.