చందర్లపాడు : బొబ్బిళ్లపాడులో అంగనవాడీ భవనం ప్రారంభం

71చూసినవారు
చందర్లపాడు : బొబ్బిళ్లపాడులో అంగనవాడీ భవనం ప్రారంభం
పిల్లలకు నాణ్యమైన విద్య, పోషకాలతో కూడిన ఆహారం అందించడంలో సీడీపీవో బాధ్యత ఉందని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. బుధవారం చందర్లపాడు మండలంలోని బొబ్బిళ్లపాడులో రూ. 10.25 లక్షలతో అంగనవాడీ భవనం ప్రారంభించారు. అంగనవాడీ కేంద్రంలో అందమైన రంగులు, చిత్రాలు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, వైట్‌బోర్డు, ఆటపరికరాలు, పాఠ్యపుస్తకాలు, కుర్చీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంపీడీవోలు పనులను వేగవంతంగా చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్