ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని.. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశంసించారు. రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న 400 గ్రామపంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎనికేపాడు టంకశాల కల్యాణ మండపంలో గన్నవరం నియోజకవర్గంలో 11 పంచాయితీలకు చెక్కులను పంపిణీ చేసారు.