ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావటంతో ఒక రోజు ముందుగానే ఎన్. టి. ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నిడమానూరు, ఎనికెపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి పింఛన్లను పంపిణీ చేశారు.