గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశానుసారం ప్రభుత్వ ఆసుపత్రిలో లైటింగ్ సమస్యలను ఆసుపత్రి డైరెక్టర్స్ దేవినేని సులోచన రాణి, నాగ ప్రసాద్ బుస్సే శుక్రవారం పరిశీలించారు. అనంతరం వాటి పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శితోను, ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసి చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సుందరీకరణ చేసి ప్రతి పేదవాడికి వైద్యం అందించేలా కృషి చేస్తామన్నారు.