ఉంగుటూరు మండలం పెదవుటపల్లి లోని బ్రదర్ జోసఫ్ తంబి ఆలయ గురువులు రేక్టర్ పాలడుగు జోసఫ్ మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్చించారు. జనవరి 4వ తేదీ నుండి ఉత్సవాలను పురస్కరించుకుని నవదిన ప్రార్థనలు ప్రారంభం కానున్నట్లు, అనంతరం 13, 14, 15 తేదీల్లో తంబి ఉత్సవాలు జరుగుతున్నట్లు ఫాదర్ జోసెఫ్ వెల్లడించారు.