విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఇండోర్ హాల్‌లో నవంబర్ 27 నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పుప్పాల విష్ణుప్రియ గొప్ప విజయం సాధించింది. జూనియర్ బాలికల విభాగంలో బంగారు పతకం గెలిచిన విష్ణుప్రియ, జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైంది. ఈ విజయాన్ని ఎన్టీఆర్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ శుక్రవారం ప్రకటించారు. జిల్లాలోని ప్రముఖులు విష్ణుప్రియను అభినందించారు.